Ticker

6/recent/ticker-posts

విశ్వనాధ్రిపాలెం గ్రామంలో పేద కుటుంబానికి అంత్యక్రియల వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి సహాయం




 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

విశ్వనాధ్రిపాలెం గ్రామంలో పేద కుటుంబానికి అంత్యక్రియల వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి సహాయం

 

ముదినేపల్లి మండలం విశ్వనాధ్రిపాలెం గ్రామానికి చెందిన మటాడ నంచరయ్య (సుమారు 60 సంవత్సరాలు) అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందారు. అత్యంత పేద కుటుంబానికి చెందిన నంచరయ్య మరణంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆయన కుమారుడు కూడా పేదరికంలో జీవిస్తున్న నేపథ్యంలో కుటుంబానికి కనీస అవసరాలు కూడా లేని పరిస్థితి నెలకొంది.

ఈ విషయం తెలుసుకున్న వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి మానవతా దృక్పథంతో స్పందించి, నంచరయ్య అంత్యక్రియల కోసం రూ.5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం కుటుంబానికి ఎంతో ఊరట కలిగించిందని గ్రామస్తులు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మరియు స్థానికులు వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి సేవా భావాన్ని అభినందిస్తూ, ఇలాంటి సహాయాలు పేద కుటుంబాలకు పెద్ద అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.