RSR NEWS
నూతన సంవత్సర వేడుకల్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సందడి –
ఏలూరు ,RSR,న్యూస్ శ్రీనివాస్ ప్రతినిధి::చింతలపూడి, జనవరి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తన నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులతో కలిసి సందడి చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ .
ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వయంగా సందడి చేస్తూ కనిపించడంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. సుమారు గంటకు పైగా అందరితో కలిసి సరదాగా గడిపిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆయన, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ ఏడాదంతా ఇదే ఆనందంతో, ఉత్సాహంతో ఉండాలని" ఆకాంక్షించారు.
మరింత జోష్ నింపిన ఎమ్మెల్యే . నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితమవుతామని, ప్రజల సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.





