'✍🏼"RSR NEWS""✍🏼
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పేరూరు గ్రామ పరిధిలోని తెరగూడెం గ్రామంలో మానవత్వాన్ని చాటిన వైద్య విద్యార్థిని, అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి…
తెరగూడెం గ్రామానికి చెందిన అంధ వృద్ధుడు పరిసే జాన్ సుబ్బారావు (70) అనారోగ్య కారణాలతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన అత్యంత పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. సుబ్బారావుకు ఒక్క కుమార్తె మాత్రమే ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న వైద్య విద్యార్థిని, అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి, తన తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ సూచనలతో వెంటనే స్పందించి, కుటుంబానికి పరామర్శ తెలిపారు. అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సహాయంగా రూ.5,000 నగదు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, కష్టకాలంలో అండగా నిలిచిన వైష్ణవి సేవాభావాన్ని అభినందించారు. సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని, ఇలాంటి సహాయాలు బాధిత కుటుంబాలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.
అంత్యక్రియల సమయంలో గ్రామ పెద్దలు, స్థానికులు, కుటుంబ సభ్యులు పాల్గొని మృతుడికి నివాళులర్పించారు. వైష్ణవి చేసిన సహాయంపై కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.
పేదల పట్ల మానవత్వంతో స్పందిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండే అంబుల వైష్ణవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.



