నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ
కలెక్టర్ వెట్రి సెల్వి గారి చేతుల మీదుగా కార్యక్రమం
ఏలూరు, తేదీ:
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాలోని కలెక్టరేట్‌లో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో హాస్టల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు ముఖ్య అతిథిగా పాల్గొని హాస్టల్ పిల్లలకు దుప్పట్లు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులను అభినందిస్తూ, వినియోగదారుల సేవలలో విద్యుత్ శాఖ ముందుండి పనిచేస్తోందని కొనియాడారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీ పి. సాల్మన్ రాజు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె.ఎం. అంబేద్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ టి. రాజకుమార్, ఏఈలు శ్రీ కే. రాంబాబు, శ్రీ పి. సంజయ్‌తో పాటు నాయకులు శ్రీ తురగా రామకృష్ణ, శ్రీ భూక్య నాగేశ్వరరావు, శ్రీ వి. రాము తదితరులు పాల్గొన్నారు