Ticker

6/recent/ticker-posts

ఏలూరులో విద్యుత్ ఉద్యోగుల శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ





 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526


ఏలూరులో విద్యుత్ ఉద్యోగుల శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

 ఏలూరు" RSR"న్యూస్  ప్రతినిధి ::

ఏలూరులో విద్యుత్ ఉద్యోగుల శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
ఏలూరు, మార్చి 
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగరంలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక అమీనా పేటలో ఉన్న విద్యుత్ కార్యాలయం ప్రాంగణంలోని శ్రీరాముడి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించి, మంగళ వాయిద్యాల మధ్య పండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమానికి ధర్మకర్తగా రిటైర్డ్ సిజిఎం శ్రీ కె.యస్.ఎన్. మూర్తి వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా రిటైర్డ్ సిజిఎంలు శ్రీ జి. రామకృష్ణ, రిటైర్డ్ ఎస్‌ఈ శ్రీ ఎ. రఘునాథ బాబు పాల్గొన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ కె.యం. అంబేద్కర్, శ్రీ టి. శశిధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎల్.వి. శ్రీనివాస్, కె. గోపాలకృష్ణ, వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఇంకా ఈ వేడుకల్లో నాయకులు తురగా రామకృష్ణ, బలుసు బాబు, యం. రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు సంప్రదాయంగా వడపప్పు, పానకం ప్రసాదంగా పంపిణీ చేశారు. అనంతరం సుమారు 2000 మందికి అన్నదానం నిర్వహించి భక్తులకు ఆతిథ్యం అందించారు.
ఈ సందర్భంగా పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, శ్రీరాముని ఆచరణలు ప్రతి ఒక్కరూ జీవితంలో అనుసరించాలని, సమాజంలో ధర్మం, న్యాయం నిలవాలని ఆకాంక్షించారు. ఈ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.......