RSR NEWS
ఏలూరు టిడిపి బడేటి క్యాంప్ ఆఫీసులో బడేటి ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీలో నియామకమైన ఏడుగురు నేతలకు ఘన సన్మానం
ఏలూరు,,,RSR, న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్::
ఏలూరు శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య ఆశీస్సులతో, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వివిధ పదవులకు నియమితులైన ఏడుగురు నాయకులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పవర్‌పేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తో కలిసి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ – ఎస్‌ఎంఆర్ పెదబాబు దంపతులు హాజరై, నియమితులైన నాయకులకు శాలువాలు కప్పి, బొకేలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా
మీడియా కో-ఆర్డినేటర్‌గా చల్లా ప్రసాద్ (కంప్యూటర్ ప్రసాద్),
ఉపాధ్యక్షులుగా గూడవల్లి వాసు,
జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉప్పాల జగదీష్ బాబు,
అధికార ప్రతినిధిగా పూజారి నిరంజన్,
ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జంపా సూర్యనారాయణ, షేక్ అహ్మద్ కాజా,
కార్యదర్శిగా చింతాటి జ్యోతి
నియమితులయ్యారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, నూతనంగా నియమితులైన నేతలకు అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణయ్య ఎమ్మెల్యే సూచించారు.




