RSR NEWS
ఏలూరు జాతరలో ఆధ్యాత్మిక వైభవం, అమ్మవారిని దర్శించుకున్న పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు, RSR, news, ప్రతినిధి : అమ్మవారిని దర్శించుకున్న పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు, :
ఏలూరు నగరంలోని దక్షిణపువీధిలో నిర్వహిస్తున్న సర్వజన సమ్మేళనం జాతర గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది. ఈ జాతరలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రత్యేకంగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.
జాతర ప్రాంగణానికి చేరుకున్న నేతలకు జాతర కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు.
ఈ సందర్భంగా జాతర కమిటీ ఆధ్వర్యంలో పల్లా శ్రీనివాస్ , ఎమ్మెల్యే ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి చంటి శాలువాలతో సత్కరించి, అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
నేతలు భక్తులతో మమేకమై జాతర విశేషాలను తెలుసుకుంటూ, నగరం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాతర కమిటీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




