RSR NEWS
Editor: Chintapalli Srinivasarao
ఏలూరు,,RSR, న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్,ప్రతినిధి: ఏలూరు, :
ఏలూరు నగరంలోని మహాత్మ జ్యోతిభా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో, రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు ఫౌండేషన్ – ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “చిన్నారినేత్రలు – సంరక్షణ” ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ,
“చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుందని” తెలిపారు.
పాఠశాలలో చదువుతున్న బాలికలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వైద్య నిపుణులు, ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు ఈ సేవా కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.






