'✍🏼"RSR NEWS""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
ముదినేపల్లి అంబేద్కర్ కాలనీలో విషాదం
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన బొజ్జ వేణు (35) తీవ్ర మధుమేహ ఇన్‌ఫెక్షన్ కారణంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. అత్యంత పేద కుటుంబానికి చెందిన వేణుకు తోడుగా మధుమేహంతో బాధపడుతున్న ఒక అన్న మాత్రమే ఉన్నారు.
వేణు కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి మానవత్వంతో స్పందించారు. తన తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ పర్యవేక్షణలో అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా స్థానికులు అంబుల వైష్ణవి సేవా భావాన్ని అభినందిస్తూ, అవసరంలో ఉన్న పేద కుటుంబాలకు ఆమె అందిస్తున్న సహాయం ఆదర్శప్రాయమని కొనియాడారు.
డాక్టర్ అంబుల మనోజ్ మాట్లాడుతూ, మా కుమార్తె, అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని చిరంజీవి అంబుల వైష్ణవి,,
“
మనిషికి మనిషి అండగా నిలబడటమే నిజమైన సేవ. చిన్న సహాయం అయినా బాధలో ఉన్న కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. వైష్ణవి చిన్నప్పటి నుంచే సేవా భావంతో ముందుకు రావడం నాకు ఆనందంగా ఉంది. సమాజానికి ఉపయోగపడేలా వైష్ణవి చేస్తున్న సేవలు మరింత మందికి ఆదర్శంగా నిలవాలి” అని అన్నారు.




