Editor: Chintapalli Srinivasarao
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు
ఏలూరు,RSR,న్యూస్ ప్రతినిధి | ఏలూరు
నూతన సంవత్సరం 2026 సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పుష్ప బొకేలు అందజేసి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలని వారు ఆకాంక్షించారు.
అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు క్యాంపు కార్యాలయానికి విచ్చేసి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులను ఆశీర్వదించారు. మత సామరస్యం, సోదరభావం మరింత బలపడాలని, జిల్లా ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, సమృద్ధి కలగాలని వారు ప్రార్థించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతుల బలోపేతం, ప్రజా సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలే లక్ష్యంగా అంకిత భావంతో పనిచేస్తామని తెలిపారు. ప్రజల సహకారం, అధికార యంత్రాంగంతో సమన్వయం కలిగి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయం జిల్లా పరిషత్ అధికారులు ఆఫీస్ సిబ్బంది తదితరులు ఆహ్లాదకర వాతావరణంతో కళకళలాడగా, శుభాకాంక్షల మధ్య కార్యక్రమం ఘనంగా ముగిసింది.


