'✍🏼"RSR NEWS""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
ఏలూరులో ఘనంగా ‘బెస్ట్ మనీ గోల్డ్’ నూతన బ్రాంచ్ ప్రారంభం
ఏలూరు, జూన్ 26: ఏలూరు నగరంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బీఎంజీ బెస్ట్ మనీ గోల్డ్ నూతన బ్రాంచ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి, రిబ్బన్ కట్ చేయడం ద్వారా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, వినియోగదారులకు పారదర్శకమైన, నమ్మకమైన సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. నాణ్యమైన సేవలతో ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందుతూ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం సంస్థ సీఈఓ సెల్వం మాట్లాడుతూ, తమ సంస్థ కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఎలాంటి మోసాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో లావాదేవీలు నిర్వహించడం తమ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని తమ సంస్థే విడిపించి, అదే రోజు మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేస్తామని తెలిపారు.
అలాగే వినియోగదారుల సౌకర్యార్థం సంస్థ ప్రతినిధులు నేరుగా ఇంటి వద్దకే వచ్చి, ఆ రోజు మార్కెట్ రేటు ప్రకారం నగదు చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేసే ప్రత్యేక సేవను అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, మేనేజ్‌మెంట్ ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, స్థానిక వ్యాపారవేత్తలు, ప్రముఖులు పాల్గొని నూతన బ్రాంచ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.






