RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (కోనసీమ) జిల్లా
జీటీసీఎమ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన
గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల అధినేత శ్రీ కాకతీయ రాజు , చైర్పర్సన్ పద్మలత డిగ్రీలను అందుకున్నారు. ఈ కార్యక్రమం ఆత్రేయపురం సెంట్రల్ చర్చిలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన ఆత్రేయపురం సెంట్రల్ చర్చి అధినేత అపో బిషప్ ఎం. సామ్యూల్ , నీలావతి దంపతుల ఆధ్వర్యంలో, జీటీసీఎమ్ డైరెక్టర్ బెంజమిన్ మరియు వారి బృందం సమక్షంలో గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించబడ్డాయి.
విద్యారంగంలో, వ్యాపార రంగంలో, అలాగే దేవుని సేవలో ముందంజలో నిలుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న కాకతీయ రాజు , పద్మలత ఈ సందర్భంగా అందరూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, హోండా షోరూం సిబ్బంది, ఆత్రేయపురం ప్రాంత ప్రముఖులు మరియు విశ్వాసులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు.


