Ticker

6/recent/ticker-posts

అమరావతి నిర్మాణానికి విశేష స్పందన రూ.116 విరాళాలతో ముందుకొస్తున్న ప్రజలు





 '✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼

అమరావతి నిర్మాణానికి విశేష స్పందన

రూ.116 విరాళాలతో ముందుకొస్తున్న ప్రజలు

అమరావతి నిర్మాణానికి విశేష స్పందన

రూ.116 విరాళాలతో ముందుకొస్తున్న ప్రజలు


అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. “అమరావతికి జీవం పోద్దాం – రూ.116 సాయం చేద్దాం” కార్యక్రమంలో భాగంగా గుడివాడలోని స్థానిక వెలమ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది.


కార్యక్రమంలో ఏజీపీ గుడివాడ జిల్లా కోర్టుకు చెందిన రెడ్డి బంగారయ్యతో పాటు వెలమ సంఘ పెద్దలు, వెలమ సంక్షేమ సంఘం గుడివాడ అధ్యక్షులు గంట ఆనంద్, కార్యదర్శి గులిపల్లి ప్రభాకర్ రావు, ఒరే శ్రీనివాసరావు, సబ్బాని రంగారావు, ముకల సత్యనారాయణ, మూడెడ్ల శ్రీధర్, వంగపండు బ్రహ్మాజీ, బాబు తదితరులు పాల్గొన్నారు. వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూ.116 చొప్పున అమరావతి నిర్మాణానికి విరాళాలు అందజేశారు.

ఈ సందర్భంగా మదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ పాల్గొన్న వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు.


ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. మన పిల్లలు తమ సొంత రాష్ట్రంలోనే విద్య, ఉద్యోగ అవకాశాలు పొందేలా రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ, చిన్న మొత్తమైనా ప్రజల సహకారం రాష్ట్ర అభివృద్ధికి బలాన్నిస్తుందని, ప్రతి ఒక్కరూ రూ.116 విరాళం అందించి అమరావతి నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.