Ticker

6/recent/ticker-posts

ఏలూరు నగరంలోని డీ మార్ట్ సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవాల సందర్భంగా మంగళవారం ఘనంగా మహా అన్నసమారాధన








 '✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼

డీమార్ట్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవాల 
సందర్భంగా మహా అన్నసమారాధన కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు 
ఏలూరు, 

ఏలూరు నగరంలోని డీ మార్ట్ సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవాల సందర్భంగా మంగళవారం ఘనంగా మహా అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  రెడ్డి అప్పలనాయుడు  హాజరయ్యారు. ఈ సందర్భంగా అభయాంజనేయ మహోత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామివారికి వివిధ పుష్పాలు, తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత  రెడ్డి అప్పలనాయుడు  చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వారం రోజులుగా భక్తి శ్రద్ధలతో వైభవంగా హనుమజ్జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బొత్స మధు, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, బోండా రాము నాయుడు, బెజవాడ నాగభూషణం కుమార్, వాసా సాయి, కొండల ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు  భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.