'✍🏼"RSR NEWS""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
విద్యార్థులు చెస్‌లో రాణించి దేశానికి పేరు తేవాలి
— సిహెచ్ అలేఖ్య
ఏలూరు నగరంలోని సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అబ్రహం & గ్యారీ కాస్పెరోవ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్-17 చెస్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 63 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్కీ బిర్యానీ హౌస్ అధినేత సిహెచ్ అలేఖ్య మాట్లాడుతూ, విద్యార్థులు చెస్ క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చెస్ వంటి మేధో క్రీడలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, ఏకాగ్రత మరియు నిర్ణయ సామర్థ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు.
చెస్ కోచ్ గంజి యోహాను ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ ప్రిన్సిపాల్ వై. స్రవంతి, సిహెచ్ అలేఖ్య చేతుల మీదుగా విజేత విద్యార్థులకు ట్రోఫీలు, మెడల్స్ మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్, దామిని, ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు.



