'✍🏼"RSR NEWS""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
ఈ నెల మే 20,, దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్
అక్రమ ఆన్‌లైన్ ఔషధ విక్రయాలు, భారీ తగ్గింపులపై కెమిస్టుల ఆందోళన
RSR"" న్యూస్""శ్రీనివాస్
ఏలూరు అక్రమ ఆన్‌లైన్ ఔషధ విక్రయాలు మరియు పెద్ద కార్పొరేట్ సంస్థలు అమలు చేస్తున్న భారీ తగ్గింపు విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారత కెమిస్టులు మరియు ఏలూరు కెమిస్ట్ & డ్రగ్గిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తా రవిచంద్ర తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కెమిస్టులు ఈ బంద్‌లో పాల్గొంటారని చెప్పారు. ధృవీకరణ లేకుండా మందుల విక్రయం జరగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం పెరుగుతోందని, దీనివల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలు భారీ తగ్గింపులతో మందులు విక్రయించడం వల్ల చిన్న స్థాయి కెమిస్టుల జీవనాధారం ప్రమాదంలో పడుతోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఔషధ సరఫరా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, కరోనా కాలంలో తీసుకొచ్చిన తాత్కాలిక నిబంధనలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కార్పొరేట్ సంస్థల అన్యాయ భారీ తగ్గింపులను అరికట్టాలని, అన్ని వ్యాపారులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
“
ఇది కేవలం వ్యాపార సమస్య మాత్రమే కాదు.. రోగుల భద్రతకు సంబంధించిన కీలక అంశం కూడా. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే నిరవధిక ఆందోళన చేపడతాం” అని ఏలూరు కెమిస్ట్ & డ్రగ్గిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తా రవిచంద్ర హెచ్చరించారు.






