Ticker

6/recent/ticker-posts

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ , కొల్లేరు సంఘం అధ్యక్షులు సైదు సత్యనారాయణ కలిసి జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి, మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.



 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao

దెందులూరు నియోజకవర్గం ఏలూరు మండలం ఏలూరు, 

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ , కొల్లేరు సంఘం అధ్యక్షులు సైదు సత్యనారాయణ కలిసి జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి,  మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు, కొల్లేరు పరిధిలోని సమస్యలు తదితర అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జి జయ మంగళ దొరబాబు, కో-క్లస్టర్ ఇంచార్జి మోరు విజయరామరాజు, గుడివాక లంక ఇంచార్జి, సర్పంచ్ నేపాల జగపతిబాబు, గుడివాక లంక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు......,.....