Ticker

6/recent/ticker-posts

సొంగా రోషన్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన సందర్భంగా తీసుకువచ్చిన ఫ్రూట్స్ మరియు దుప్పట్లను ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.




RSR NEWS

ఎడిటర్: చింతపల్లి శ్రీనివాసరావు 9949291526


2026 నూతన సంవత్సర సందర్భంగా ఆసుపత్రిలో ఫ్రూట్స్, దుప్పట్ల పంపిణీ 

చింతలపూడి, జనవరి –
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన సందర్భంగా అందించిన పండ్లు మరియు దుప్పట్లను ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంపిణీ చేయించారు.
ఈ సందర్భంగా చింతలపూడి పట్టణ కూటమి నాయకులు, ఏరియా హాస్పిటల్ కమిటీ సభ్యులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కమిటీ చైర్మన్‌లను శాసనసభ్యులు తమపు కార్యాలయానికి పిలిపించి, అందించిన ఫ్రూట్స్, దుప్పట్లను పూర్తిగా ఆసుపత్రికి పంపిణీ చేసింది.
అనంతరం శాసనసభ్యులు సొంగా రోషన్ మరియు మేడం విజయ గారు కలిసి చింతలపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్నారు. రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని, వారికి అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది మరియు ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. నూతన సంవత్సరాన్ని సేవా భావంతో ప్రారంభించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.