ఏలూరు ఆర్ ఎస్ ఆర్ న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ : ఏలూరు, జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని "పర్యావరణం లో అవకాశాలు" అనే థీమ్ తో కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ మాసంలో పర్యావరణంలో అవకాశాలు థీమ్‌తో నిర్వహించే కార్యక్రమాలు జిల్లాలో వాడవాడలా విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో ప్రభుత్వ సంస్థలు, ప్రజలు భాగస్వామ్యమై పర్యావరణాన్ని కాపాడు కోవడం, వ్యర్థాలు నిర్వహణ ద్వారా సంపద సృష్టించడం, పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంపై దృష్టిపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో పర్యావరణం పట్ల అవగాహన పెంచి, పరిశుభ్రతను ఒక జీవన విధానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వ్యర్థాలు నుండి సంపద సృష్టించడం, ఈ-వ్యర్థాలు సేకరణ, సురక్షితమైన రీసైక్లింగు పద్ధతులపై అవగాహన కల్పించడం, చెత్తను తడి, పొడి, హానికర వ్యర్థాలుగా వేరుచేసే విధానాన్ని ప్రోత్సహించడం జరుగు తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, చెట్లు సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటి సంరక్షణపై దృష్టి సారించడం దృష్టి పెట్టామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛందసంస్థలు భాగస్వామ్యం అయ్యి పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, జిల్లా కలెక్టరేటు పరిపాలన అధికారి యన్.వి.నాంచారయ్య, సూపర్డెంట్లు, రెవెన్యూ వివిధ విభాగాలు ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి: ఏలూరు, జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని "పర్యావరణం లో అవకాశాలు" అనే థీమ్ తో కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ ప్రతిజ్ఞ చేయించారు.