Ticker

6/recent/ticker-posts

ముదినేపల్లి గ్రామంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ప్రాంగణంలో అమరావతి అభివృద్ధి లక్ష్యంగా వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం ఘనంగా నిర్వహించబడింది. ఈ యజ్ఞాన్ని డాక్టర్ మనోజ్ మరియు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి సంయుక్తంగా నిర్వహించారు.





 

'✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼

ఏలూరు జిల్లా | ముదినేపల్లి మండలం | ముదినేపల్లి

శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం ఘనంగా నిర్వహణ

అమరావతి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు


ముదినేపల్లి గ్రామంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ప్రాంగణంలో అమరావతి అభివృద్ధి లక్ష్యంగా వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం ఘనంగా నిర్వహించబడింది. ఈ యజ్ఞాన్ని డాక్టర్ మనోజ్ మరియు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి సంయుక్తంగా నిర్వహించారు.


డాక్టర్ మనోజ్ వ్యాఖ్యలు:

ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ,

“మా స్వగృహంలో నిర్వహించిన ఈ రాజశ్యామల యజ్ఞం ద్వారా అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మన యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు లభించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.

కూటమి ప్రభుత్వ సహకారంతో అమరావతిని సాధించుకున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులను గౌరవిస్తూ వారికి పాదపూజ చేసి సన్మానించడం మా బాధ్యతగా భావిస్తున్నాము.

రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సీఆర్డీఏ ఖాతాకు రూ.116/- విరాళంగా క్యూఆర్ కోడ్ ద్వారా అందరూ సహకరించాలని కోరుతున్నాము” అని తెలిపారు.


అంబుల వైష్ణవి వ్యాఖ్యలు:

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మాట్లాడుతూ,

అమరావతి అభివృద్ధి కోసం మా ఆసుపత్రి ప్రాంగణంలో ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించాము. గత రెండేళ్లుగా సీఆర్డీఏ ఖాతాకు రూ.116/- చొప్పున విరాళాలు సేకరిస్తూ అమరావతి నిర్మాణానికి మేము సహకరిస్తున్నాము.

 

అమరావతికి భూములు ఇచ్చిన రైతులను గౌరవిస్తూ పాదపూజ చేసి సన్మానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.