Ticker

6/recent/ticker-posts

ఏలూరు, తేదీ : 06-01-2026 స్థానిక 44వ డివిజన్ గన్‌బజార్ ప్రాంతంలో హజరత్ యా అలీ ముష్కిల్ కూష మహాత్ముల వారి ఉరుసు మహోత్సవం,




 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526

ఏలూరు, తేదీ : 06-01-2026

స్థానిక 44వ డివిజన్ గన్‌బజార్ ప్రాంతంలో హజరత్ యా అలీ ముష్కిల్ కూష మహాత్ముల వారి ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా హజరత్ మౌలా అలీ ముష్కిల్ కుషా మహాత్ముల (గొలుసుల పంజ) వారి ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్.ఎం.ఆర్. పెదబాబు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.

ఉరుసు ఊరేగింపులో పాల్గొన్న శ్రీ ఎస్.ఎం.ఆర్. పెదబాబు గారికి ఉరుసు నిర్వాహకులు పుష్పహారాలతో ఘనంగా సత్కరించి శాలువాతో గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హజరత్ యా అలీ ముష్కిల్ కూష మహాత్ముల ఆశీస్సులతో నగర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి నాగబాబు, బత్తిన విజయ్ కుమార్, పాము శామ్యూల్ తదితర ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఉరుసు కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.