Ticker

6/recent/ticker-posts

పోలవరం పనుల పరిశీలనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికిన జడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ ఏలూరు, తేదీ :



 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526

పోలవరం పనుల పరిశీలనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు

ఘనంగా స్వాగతం పలికిన జడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్

ఏలూరు, తేదీ :

ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారనుందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు జిల్లా ప్రజలంతా సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.