Ticker

6/recent/ticker-posts

ఏలూరుపల్స్ పోలియో దినోత్సవం – జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహణ

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao

పల్స్ పోలియో దినోత్సవం – జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహణ

పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎన్.ఆర్.పేటలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల సహకారం,అవగాహణ అత్యంత అవసరమని తెలిపారు.

పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని, ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంటూ, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.