Ticker

6/recent/ticker-posts

ఏలూరు నగరంలోని వై.ఎం.హెచ్.ఏ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ భాషా–సాంస్కృతిక శాఖ సహకారంతో గత మూడు రోజులుగా నిర్వహించిన అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి.







 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao

అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు ఘనంగా ముగింపు

ఏలూరు, డిసెంబర్ 28:

ఏలూరు నగరంలోని వై.ఎం.హెచ్.ఏ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ భాషా–సాంస్కృతిక శాఖ సహకారంతో గత మూడు రోజులుగా నిర్వహించిన అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి.

మూడవ రోజు ఉదయం నుండి కూచిపూడి, జానపద సీనియర్స్ విభాగం, బృంద నృత్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలలో చివరి రోజు 150 మందికి పైగా చిన్నారి, యువ నర్తకులు పాల్గొని తమ నృత్య ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు.

సాయంత్రం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు జాతీయ స్థాయి శాస్త్రీయ యువ నృత్యోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్.వి.వి.ఎస్. పాపారావు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో నాట్యాచార్య లయన్ దువ్వి హేమసుందర్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లయన్స్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని తెలిపారు.

ఈ నృత్యోత్సవాల్లో

విశాఖపట్నంకు చెందిన కుమారి గాయత్రి కూచిపూడి నృత్యం,

ఒరిస్సా బరంపురంకు చెందిన కుమారి తులికా రెడ్డి ఒడిసి నృత్యం,

చెన్నైకు చెందిన డి. చక్రవర్తి కూచిపూడి,

కరీంనగర్‌కు చెందిన టి. సంతోష్ పెరిణి శివతాండవం,

సామర్లకోటకు చెందిన చక్రవర్తుల పవన్ కుమార్ కూచిపూడి,

వరంగల్‌కు చెందిన కుమారి బి. వైష్ణవి పేరిని లాస్యం,

కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత, కాకినాడకు చెందిన బి. మల్లిఖార్జునరావు భరతనాట్యం

ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వీరందరికీ సంస్థ తరఫున “నృత్య కౌముది అవార్డులు” ప్రదానం చేశారు.

అదేవిధంగా, ప్రఖ్యాత కూచిపూడి నృత్య గురువు, యక్షగాన ఖంటీరవ డా. పసుమర్తి శేషుబాబు గారిని భరత కళాప్రపూర్ణ శ్రీ కోరాడ నరసింహారావు మెమోరియల్ నృత్య రంగ సేవాతపస్వి అవార్డుతో ఘనంగా సత్కరించారు.

అనంతరం జరిగిన అవార్డులు, బహుమతి ప్రదానోత్సవ సభలో

ఆర్.టి.సి విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు,

లయన్స్ పూర్వ గవర్నర్లు దామెర రంగారావు, వేమా కోటేశ్వరరావు,

ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శులు లేళ్ల వెంకటేశ్వరరావు, దువ్వి రామారావు,

సంస్థ ప్రతినిధులు డా. ముసునూరి వెంకట ప్రసాద్, యర్రా హరనాథ్, కానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.