✍🏼RSR NEWS✍🏼
🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం బలివే ఆలయాన్ని సందర్శించారు
ఏలూరు ముసునూరు, ఫిబ్రవరి: ముసునూరు మండలం బలివే గ్రామంలో జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం బలివే ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పాలకవర్గం, కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆలయ మర్యాదలతో, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకొని అంతరాలయంలో అర్చకుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి, దుశ్శాలువాతో మంత్రిని సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అర్చకులు మంత్రికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఎస్పీ కె.వి.వి.యన్.వి. ప్రసాదు, ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు బొమ్మకంటి శ్యామల రావు, కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహా శివరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.



