✍🏼RSR NEWS✍🏼
🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
చింతలపూడిలో 2 జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాల మంజూరు
చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ విజ్ఞప్తికి న్యాయశాఖ సానుకూల స్పందన
చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు న్యాయసేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు కీలకమైన ముందడుగు పడింది. చింతలపూడిలో రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాల నిర్మాణం చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు న్యాయశాఖ కార్యదర్శి జి. ప్రతిభా దేవిని కలిసి విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం సచివాలయంలో జరిగిన భేటీలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ చింతలపూడి ప్రాంతంలో కేసుల సంఖ్య పెరుగుతున్నదని, ప్రస్తుతం ఉన్న న్యాయ సదుపాయాలు సరిపోవడం లేదని వివరించారు. ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక న్యాయసేవలు అందించాలంటే అదనపు కోర్టు భవనాల నిర్మాణం అత్యవసరమని రోషన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అధికారిక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.
అదేవిధంగా, కోర్టుల పనితీరు సజావుగా కొనసాగేందుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ( ఏ జి పి ) నియామకంపై కూడా ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టి ఆకర్షించారు. కోర్టులలో ప్రభుత్వ తరఫున వాదనలు సమర్థంగా వినిపించేందుకు తక్షణం ఏ జి పి నియామకం అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన న్యాయశాఖ కార్యదర్శి శ్
జి. ప్రతిభా దేవి , చింతలపూడిలో రెండు అదనపు జూనియర్ సివిల్ కోర్టు భవనాలను 2026-27 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేస్తామని తెలిపారు. కోర్టుల కోసం అవసరమైన సిబ్బందిని కూడా అదే ఆర్థిక సంవత్సరంలో నియమిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం పూర్తయ్యిన అనంతరం అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నియామకం కూడా చేపడతామని వెల్లడించారు.
ఈ నిర్ణయంతో చింతలపూడి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత వేగవంతంగా, సులభంగా అందే అవకాశముంది. కేసుల పరిష్కారంలో ఆలస్యాలు తగ్గి, న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చింతలపూడి అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తీసుకుంటున్న చొరవలను ప్రజలు అభినందిస్తున్నారు.


