Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లాసిగరెట్లు పై నూతన GST విధానంపై పొగాకు రైతుల ఆందోళన* *ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు వినతి పత్రం అందించిన పొగాకు రైతులు*





 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526

ఏలూరు జిల్లా*


*సిగరెట్లు పై నూతన GST విధానంపై పొగాకు రైతుల ఆందోళన*


*ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు వినతి పత్రం అందించిన పొగాకు రైతులు*


*స్వదేశీ అమ్మకాలు పడిపోయి, విదేశీ అమ్మకాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు*


*సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్*

----------

* సిగరెట్లపై కేంద్రం అమలు చేస్తున్న నూతన జీఎస్టీ విధానం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏలూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ ను కలిసిన పొగాకు రైతులు కేంద్రం అమలు చేస్తున్న నూతన జీఎస్టీ విధానం ద్వారా సిగరెట్ల స్వదేశీ అమ్మకాలు పడిపోయి విదేశీ అమ్మకాలు పెరిగే ప్రమాదం ఉందని , తద్వారా లక్షలాదిమంది పొగాకు రైతుల జీవన పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, సత్వరమే నూతన జీఎస్టీ విధానాన్ని కేంద్రం సవరించేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని, రైతులు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని తెలిపారు