Editor: Chintapalli Srinivasarao 9949291526
జంగారెడ్డిగూడెం, తేదీ: ______
జంగారెడ్డిగూడెం పట్టణం డాంగే నగర్లో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
డాంగే నగర్లో ఎన్హెచ్పి ( ఎన్ హెచ్ పి ఏపిహెచ్ఎస్ఎస్పి) పథకాల కింద రూ.104.92 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఈ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గారు స్థానిక కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆసుపత్రిలోని వివిధ గదులు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందిని అడిగి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందేలా నిరంతరం కృషి చేయాలని వైద్య అధికారులకు సూచించారు.
ఈ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజారోగ్య సేవలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆసుపత్రి సిబ్బంది, పట్టణ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

