Editor: Chintapalli Srinivasarao 9949291526
ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆచంట, తేదీ :
ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు పితానీ సత్యనారాయణ కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన కేతా సత్యవతి మీరయ్య జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మశ్రీప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు న్యాయమైన ధరలు, మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. మార్కెట్ అభివృద్ధి, మౌలిక వసతుల పెంపు, రైతులకు అవసరమైన సదుపాయాల కల్పనలో చైర్మన్‌గా కేతా సత్యవతి మీరయ్య విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, చైర్మన్ మంతెన రామరాజు , తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ షరీఫ్ , పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తోట సీతమహాలక్ష్మి , నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ , రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పితల సుజాత , మాజీ శాసన మండలి సభ్యులు అంగర రామ్మోహన్ పాల్గొన్నారు.
అలాగే కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




