Ticker

6/recent/ticker-posts

మర్రిబంధంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి*




 *

RSR NEWS

ఎడిటర్: చింతపల్లి శ్రీనివాసరావు 9949291526

భూ రికార్డులు మార్చడానికి వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్*


*ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడం సుపరిపాలన లక్ష్యం*


*మర్రిబంధంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి*


        నూజివీడు/ ఏలూరు, జనవరి, 4 : భూ రికార్డులను ఎవరూ మార్చుకోవడానికి వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో మీ భూమి.. మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు మంత్రి పార్థసారధి అందించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించే పాలనను ముఖ్యమంత్రి అందిస్తారు. పేదవారు రూపాయి, రూపాయి దాచుకుని కొనుకున్న భూములపై ​​వారికి హక్కులు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చిందని, గత ప్రభుత్వం రాజకీయ కక్షలతో రెవిన్యూ రికార్డులలోని భూముల వివరాలను తమ రాజకీయ అనుయాయులకు అనుకూలంగా మార్పులు చేసిందని, దీని కారణంగా జిరాయితీ భూములను సైతం 22A వంటి వివాదస్పద భూములు జాబితాలో చేరి, ఎంతో మంది అనేక ఇబ్బందులు ఉన్నాయి. ల్యాండ్ టైటలింగ్ ఆక్ట్ ద్వారా భూములపై ​​భూమి యజమానికి హక్కు ఉంది, లేనిదీ తెలియకుండా చేశారన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై ఉండాల్సింది రాజముద్ర అని, ఎవరో వ్యక్తి ఫోటో కాదన్నారు. ప్రజల హక్కులను కాపాడేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తమ ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రెవిన్యూ, భూ సమస్యలను పరిష్కరించాలని మంత్రులను అధికారులను ఆదేశించారు. ఇటీవల 22ఎ భూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకుని వివాదం చేసినప్పటికీ 22ఎ నుండి భూములను తొలగించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ప్రజల అభిప్రాయాలను మరింత స్పష్టంగా, అవినీతికి తావులేకుండా అమలు చేస్తున్నామన్నారు. 

           కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రముఖులు ఉన్నారు. 

--