పెరవలి గ్రామంలో నిర్వహించిన అమర జీవి జలధారా వాటర్ గ్రిడ్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌కు సంబంధించిన పలు కీలక సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు.
వినతి పత్రాలలో ముఖ్యంగా
. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా – జడ్పీ రోడ్ల మరమ్మత్తులకు నిధుల విడుదల
ఇటివలి కురిసిన వర్షాలకు జిల్లాలోని అనేక జడ్పీరోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నాయని, వాటి మరమ్మత్తులు చేపట్టడం అత్యవసరమని తెలిపారు.
సత్య సాయి సిపిస్ – ఓ&మ్ బిల్లులు మరియు విద్యుత్ చార్జీల భర్తీ
సత్యసాయి సమగ్ర రక్షిత తాగునీటి పథకం కోసం గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు మరియు వివిధ సీపీస్ స్కీంల విద్యుత్ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు.
నాన్ - ప్రొవింషలిస్డ్ పెన్షనర్లు కు పెండింగ్ బకాయిలు
జిల్లా పరిషత్ పరిధిలోని నాన్ - ప్రొవింషలిజడ్ పింఛను దారులకు మరియు వారి కుటుంబాలకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుండి పించను చేల్లిస్తున్నాము అని, దని వాల్ల జిల్లా పరిషత్ కు భారంగా ఉన్నదని. వారి పించను ప్రభుత్వం 010 పద్దు నుండి చెల్లింపు చేయు విధంగా చర్యలు చేసుకోవాలని కోరారు.
జడ్పీటీసి సభ్యుల గౌరవ వేతనం – అక్టోబర్ 2022 నుండి పెండింగ్
జడ్పీటీసి సభ్యులకు గడచిన దీర్ఘకాలంగా గౌరవ వేతనం విడుదల చేయకపోవడంతో వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు జిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నందున గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు.
గ్రామీణ తాగునీటి చెరువులకు ఫెన్సింగ్ మరియు ఇన్లెట్–అవుట్లెట్ ఏర్పాటు
తాగునీటి చెరువుల చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల
అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి
చెరువులకు ఆత్మహత్యల కోసం వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది మరియు ప్రమాదకర మరణాలు జరుగుతున్నాయి అని.
పశువులు నీటిలోకి వెళ్లి నీటిని కలుషితం చేస్తున్నాయి
డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు వినతి పత్రాలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


