Ticker

6/recent/ticker-posts

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర్ వర ప్రసాద్’ చిత్రం విడుదల సందర్భంగా ఏలూరు నగరంలో అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.





 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర్ వర ప్రసాద్’ చిత్రం విడుదల సందర్భంగా ఏలూరు నగరంలో అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, చంటి జనసేన నాయకులు రెడ్డప్పల నాయుడు, నారా శేషు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నగరంలోని సత్యనారాయణ థియేటర్ మరియు విజయలక్ష్మి థియేటర్ల వద్ద కేక్ కటింగ్ చేసి, పటాకులు కాల్చుతూ, నినాదాలతో అభిమానులతో కలిసి ఆనందోత్సాహాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని, ఆయనకు ఉన్న అభిమానుల ప్రేమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.