ఏలూరు మండలం మాదేపల్లి గ్రామానికి చెందిన శెట్టిబలిజ గౌరవ పెద్దలు, దంపర బోయిన సుబ్రహ్మణ్యం గారి అకాల మరణం గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ విషాదకర ఘటనకు చింతిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈరోజు మాదేపల్లి గ్రామంలోని శెట్టిబలిజ కమిటీ హాల్లో సంతాప సభ ఏర్పాటు చేయబడింది. ఈ సంతాప సభకు మాదేపల్లి గ్రామానికి చెందిన అన్ని కమ్యూనిటీల నాయకులు, గౌరవ పెద్దలు, గ్రామ ప్రముఖులు హాజరై దంపర బోయిన సుబ్రహ్మణ్యం గారికి ఘనంగా నివాళులు అర్పించారు. సుబ్రహ్మణ్యం గారు గ్రామ అభివృద్ధికి, సమాజ ఐక్యతకు చేసిన సేవలను సభలో పాల్గొన్నవారు గుర్తుచేసుకున్నారు. వారి మరణం గ్రామానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అందరూ ఒక్క స్వరంతో వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఏ లోకంలో ఉన్న వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.






