Editor: Chintapalli Srinivasarao 9949291526
ద్వారకాతిరుమలలో ఎంపీ లాడ్స్ నిధులతో మల్టీ పర్పస్ భవనానికి అదనపు వసతి శంకుస్థాపన
గోపాలపురం నియోజకవర్గం, ద్వారకాతిరుమలలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.49 లక్షల వ్యయంతో నిర్మించనున్న మల్టీ పర్పస్ భవనానికి అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బహుళోపయోగ భవనాలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ , గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




