Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరు, తేదీ :
ధనుర్మాసం సందర్భంగా స్థానిక పవర్‌పేటలో కొలువై ఉన్న శ్రీ వాసుదేవ స్వామి వారి సన్నిధానంలో నిర్వహించిన అభిషేక, అర్చన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ జన్మ ధన్యమైందని ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ – ఎస్.ఎం.ఆర్. పెదబాబు దంపతులు తెలిపారు.
ఈ సందర్భంగా అర్చక స్వామి కందుకూరి వెంకట విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మేయర్ దంపతులచే దశావతార పూర్వక ఏకాదశ ద్రవ్య స్నాపనము (అభిషేకము) ఘనంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 7 గంటల నుండి విశేష తులసీ దళార్చన, పుష్పాభిషేకం, చుట్టోత్సవం, మధనం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ – పెదబాబు దంపతులు మాట్లాడుతూ,
ధనుర్మాసంలో వాసుదేవ స్వామి వారికి అభిషేకాలు, విశేష అర్చన కార్యక్రమాలు నిర్వహించడం తమకు అపార ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వందలాది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో స్వామివారికి జరిగిన పూజా కార్యక్రమాలు కనులారా దర్శించుకోవడం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు మేయర్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జవ్వాజి రామగోపాల్, ఆలయ ఈవో ఎం. రామాంజనేయులు మేయర్ దంపతులను సత్కరించి, పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మికానందాన్ని పొందారు.



