Editor: Chintapalli Srinivasarao 9949291526
పేదల పక్షపాతి ఎన్టీఆర్ ఒక్కరే – ఎమ్మెల్యే ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య ( చంటి)
ఏలూరు, జనవరి 18:
పేదవర్గాలను అన్నివిధాలా ఆదరించి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారేనని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏలూరు నగరంలోని 44వ డివిజన్ గన్‌బజార్ సెంటర్‌లో, నూకాలమ్మ గుడి ఎదురుగా డివిజన్ పార్టీ ఇన్‌ఛార్జ్ చౌటపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే బడేటి చంటి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ…
కిలో రెండురూపాయల బియ్యం పథకం, సామాజిక భద్రతా పెన్షన్లు, పక్కా గృహాల నిర్మాణం, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు వంటి ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల గుండెల్లో నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
అవినీతికి తావివ్వని నిష్కళంకమైన రాజకీయ జీవితం గడిపిన ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లిన తొలి నాయకుడు ఎన్టీఆర్ అని, ఎదురులేని నాయకుడిగా అభివృద్ధి మార్గాన్ని చూపిన ఆయన దారి నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకమని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని విరాళంగా అందించిన మాజీ ప్రధానోపాధ్యాయులు జల్లా వీరభద్రరావు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విగ్రహ శిల్పి దేవిక వడయార్ సత్కరించారు. అనంతరం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
ఎఎంసి చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి,
కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్‌ఎం ఆర్ పెదబాబు,
క్లస్టర్ ఇన్‌ఛార్జ్ మల్లెపు రాము,
డివిజన్ కో-ఇన్‌ఛార్జ్ మెలిపాక వెంకన్న,
జంపా సూర్యనారాయణ, బొద్దాని శ్రీనివాస్, మేతర అజయ్ బాబు, బడిపాటి వెంకటరావు, దావులూరి వెంకటలక్ష్మి,
కరీం, ఎన్. శ్రీను, జఫర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.





