Ticker

6/recent/ticker-posts

ఏలూరు నగర డిప్యూటీ మేయర్‌గా కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆశీస్సులతో నిర్ణయం –




 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526

ఏలూరు నగర డిప్యూటీ మేయర్‌గా కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆశీస్సులతో నిర్ణయం – త్వరలో ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్‌కు ఆదేశం

ఏలూరు,

ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో ముందుగా జరిగిన ఒప్పందం మేరకు డిప్యూటీ మేయర్ పదవిని 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావుకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పరంగా కార్పొరేటర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ మేయర్‌గా కర్రి శ్రీనివాసరావును నిర్ణయిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రకారం, త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భాను ప్రతాప్ ఆదేశించినట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య , నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య , మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కర్రి శ్రీనివాసరావుకు పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

డిప్యూటీ మేయర్‌గా ఎంపికైన కర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ,

తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య , మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.

నగర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాసరావు అభిమానులు, పలువురు కార్పొరేటర్లు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.