Ticker

6/recent/ticker-posts

గాలాయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు




RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

 గాలాయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు


ఏలూరు,RSR,srinivas, న్యూస్ ప్రతినిధి దెందులూరు,
:
అమ్మల గన్నా అమ్మగా, చల్లని తల్లిగా పేరుపొందిన గాలాయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి 69వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, దెందులూరు పోలీసులు సంయుక్తంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలకు మరింత వైభవం చేకూర్చారు.
శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో గాలాయగూడెం గ్రామం ఉత్సవ కళతో కళకళలాడింది


శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో గాలాయగూడెం గ్రామం ఉత్సవ కళతో కళకళలాడింది.



J