Ticker

6/recent/ticker-posts

అమరావతిపై కమ్ముకున్న చీకట్లు తొలగిపోయాయి: ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అధినేత ఉండవల్లి రాము కుటుంబం సభ్యులు ఆనందోస్తాలతో దీపారాధన





 
RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

అమరావతిపై కమ్ముకున్న చీకట్లు తొలగిపోయాయి: ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అధినేత  ఉండవల్లి రాము కుటుంబం సభ్యులు ఆనందోస్తాలతో  దీపారాధన 

 ఏలూరు   ""RSR""srinivas,,న్యూస్  ప్రతినిధి:::

రాజధాని అమరావతిపై కమ్ముకున్న అనిశ్చితి చీకట్లు తొలగిపోయాయని ఉండవల్లి కన్స్ట్రక్షన్స్‌కు అధినేత ఉండవల్లి రాము దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని వారు పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో అమరావతికి న్యాయం జరిగిందని, ప్రజల ఆశలు నెరవేరే దిశగా ఇది కీలక అడుగని తెలిపారు. బిల్లు ఆమోదం ఏలూరు జిల్లా ఏలూరులోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అధినేత ఉండవల్లి రాము దంపతులు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ ఉండవల్లి రాము కుటుంబ సభ్యులు  మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం మరింత వేగవంతం కావాలని, రైతుల త్యాగాలు ఫలించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో అమరావతి దేశంలోనే ఆదర్శ రాజధానిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.