RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
Editor: Chintapalli Srinivasarao 9949291526
అమరావతి రాజధాని పరిరక్షణకు ప్రత్యేక పూజలు – మహిళల పాదయాత్రకు పిలుపు
అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ సారథ్యంలో అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమంలో భాగస్వాములైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
మనకు ఎలాంటి కష్టం, బాధ, దుఃఖం వచ్చినా… అలాగే విజయాలు, సంతోషాలు లభించినా ముందుగా మనం దర్శించే శక్తి స్వరూపిణి, జగన్మాత శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన ఈ శుభ సందర్భంలో, ఆ తల్లికి మొక్కు తీర్చుకోవాలనే సంకల్పంతో ఉద్యమ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరుతున్నారు.
ఈ కార్యక్రమం శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) సహకారంతో నిర్వహించబడుతుంది. ప్రకాశం బ్యారేజ్ (మోటెల్) వద్ద నుండి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో పాల్గొని, భక్తితో అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నేత పువ్వాడ సుధాకరరావు మాట్లాడుతూ, రైతుల త్యాగాలతో అమరావతి అజరామరంగా నిలిచిందని తెలిపారు.
అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఒక్కొక్కరు రూ.116 చొప్పున విరాళం అందించి అమరావతి అభివృద్ధికి తోడ్పడాలని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పిలుపునిచ్చారు.





