RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
అమరావతి / మల్కాపురం : అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదుగా
రైతులకు పాదపూజ మరియు సన్మానము కార్యక్రమం ఘనంగా నిర్వహణ ▪️
అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు సమర్పించిన రైతులకు గౌరవంగా పాదపూజ కార్యక్రమం మల్కాపురంలో ఘనంగా నిర్వహించారు. “అమరావతికి జీవం పోద్దాం – రూ.116 సాయం చేద్దాం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాల్గొని రైతులకు పాదపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగం అపారమని, ఇప్పటికే 29 గ్రామాలలో పాదపూజ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి విద్యాభ్యాసం కారణంగా హాజరు కాలేకపోయినప్పటికీ, ఈ మహత్తర కార్యక్రమాన్ని తన బాధ్యతగా తీసుకుని కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రూ.116 చొప్పున సిఆర్డిఏ ఖాతాకు క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు అందించాలని ప్రజలను కోరారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు.




