RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
పుట్టినరోజు జరుపుకుంటున్న – విద్యా విద్యార్థిని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు,
ఏలూరు జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అంబుల మనోజ్ కుమార్తె, వైద్య విద్యార్థిని, అమరావతి అంబాసిడర్ చిరంజీవి అంబుల వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా ఆమెకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మణా ఆ వాసవిమాతను ప్రార్థిస్తూ, భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. “దీర్ఘాయుష్మాన్ భవ” అంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని ఆశీర్వదించారు.
*రాజధానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి*
*పొలం అమ్మి రాజధానికి విరాళం ఇచ్చిన వైష్టవి స్ఫూర్తిని అభినందించిన సీఎం చంద్రబాబు*
*రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైష్ణవిని నియమించిన సిఎం చంద్రబాబు*
*పోలవరం కోసం మరో రూ.1 లక్ష విరాళం ఇచ్చిన వైష్ణవిని ప్రశంసించిన ముఖ్యమంత్రి*
అతి చిన్న వయసులోనే సేవా తత్వాన్ని అలవాటు చేసుకున్న వైష్ణవి, తనకున్న ఆస్తులు అయిన పొలం, బంగారం అమ్మి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తన వంతు విరాళాన్ని అందించడం విశేషం. “
అమరావతికి జీవం పోద్దాం – రూ.116/-లు సాయం చేద్దాం, చేయి చేయి కలుపుదాం, రాజధాని నిర్మిద్దాం” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించారు.
తన చదువుల నిమిత్తం బిజీగా ఉండడం వల్ల స్వయంగా హాజరుకాలేకపోయినప్పటికీ, తన తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ ద్వారా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదపూజలు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలు, రాజధాని రైతులు మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు అంబుల వైష్ణవికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ అంబుల వైష్ణవి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేశారు.





