Ticker

6/recent/ticker-posts

ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందనాస్ A1 కార్ యాక్సెసరీస్ షోరూమ్‌ను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఘనంగా ప్రారంభించారు.





 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రాంతంలో చందనాస్ A1 కార్ యాక్సెసరీస్ షోరూమ్ ప్రారంభం

ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందనాస్ A1 కార్ యాక్సెసరీస్ షోరూమ్‌ను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఘనంగా ప్రారంభించారు.

సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాగంటి చంద్రబోస్, కామరెడ్డి షణ్ముఖ సాయి లు మాట్లాడుతూ, ఈ షోరూమ్‌లో కార్లకు అవసరమైన అన్ని రకాల యాక్సెసరీస్, ఆధునిక డిజైన్లతో కూడిన మెటీరియల్స్ వినియోగదారులకు ఒకే చోట అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏలూరు నగరం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకసారి షోరూమ్‌ను సందర్శించి, అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు.

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ధరలు, నాణ్యమైన ఉత్పత్తులతో సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నూతన వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు , దెందులూరు నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ గారపాటి రామ సీత, విజయరాయి సొసైటీ చైర్మన్ బొప్పన సుధాకర్ తదితర ప్రముఖులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.