Ticker

6/recent/ticker-posts

దెందులూరులో నియోజవర్గం ఏలూరు మండలం సురక్షిత తాగునీటి ప్లాంట్ల ప్రారంభం ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.









 
RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

దెందులూరులో నియోజవర్గం ఏలూరు మండలం  సురక్షిత తాగునీటి ప్లాంట్ల ప్రారంభం
 
ఏలూరు ""RSR""srinivas""న్యూస్ ప్రతినిధి :::

దెందులూరులో నియోజవర్గం ఏలూరు మండలం  సురక్షిత తాగునీటి ప్లాంట్ల ప్రారంభం
ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

ఏలూరు రూరల్ మండల పరిధిలో అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం స్వంత నిధులతో నలభై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు సురక్షిత తాగునీటి ప్లాంట్లను గురువారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దాత సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు.
శ్రీపర్రు పంచాయతీ పరిధిలోని శ్రీపర్రు, మానూరు, మహేశ్వరపురం గ్రామాలు మరియు మాదేపల్లి పంచాయతీ పరిధిలోని లింగారావుగూడెం గ్రామంలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని  ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, శిలాఫలకాలను ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి ప్లాంట్లను ప్రజలకు అంకితం చేశారు.

అనంతరం మహిళలకు బిందెల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందజేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరియు దాత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యంను కృతజ్ఞతలతో అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, తాను పుట్టి పెరిగిన ప్రాంతాల అభివృద్ధి కోసం నలభై నాలుగు లక్షలు వెచ్చించి నీటి ప్లాంట్లు ఏర్పాటు చేసిన అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం సేవా భావం అభినందనీయమని అన్నారు. ఇలాంటి దాతలు ప్రతి గ్రామానికి అవసరమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ప్రజా ప్రైవేట్ ప్రజల భాగస్వామ్య విధానంతో ప్రభుత్వ నిధులకు తోడు ప్రైవేట్ మరియు ప్రజల సహకారం కలిసివస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అవసరమైన అనుమతులు, సహకారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, చింతమనేని ప్రభాకర్ దాతతో కలిసి ప్లాంట్‌లోని ఆధునిక నీటి శుద్ధి వ్యవస్థను పరిశీలించి ప్రారంభించారు. గ్రామస్తులు పూలమాలలు, 
మంగళహారతులతో ఘన స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు. అలాగే ఆయా గ్రామాల్లోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, కార్యదర్శి పైడిపాటి శేఖర్, సైదు సత్యనారాయణ, నేతల రవి  జాలిపూడి సంఘం అధ్యక్షుడు మోతేపల్లి పవన్, ఇతర నాయకులు, అధికారులు, సంస్థ ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.