Ticker

6/recent/ticker-posts

అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో రైతులు మరియు గ్రీన్ అంబాసిడర్లతో కలిసి పాదపూజ మరియు సన్మాన కార్యక్రమం






 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526


అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో రైతులు మరియు గ్రీన్ అంబాసిడర్లతో కలిసి పాదపూజ మరియు సన్మాన కార్యక్రమం
 
ఏలూరు""" RSR'""srinivas""న్యూస్ ప్రతినిధి ::::

వైద్య విద్యార్థిని, అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి చదువుల నిమిత్తం బిజీగా ఉండడం వల్ల, వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో రైతులు మరియు గ్రీన్ అంబాసిడర్లతో కలిసి పాదపూజ మరియు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 20 మంది రైతులు, 5 మంది గ్రీన్ అంబాసిడర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధికి తమ మద్దతు తెలుపుతూ, (సి.ఆర్.డి.ఏ ) క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరూ రూ.116 చొప్పున విరాళంగా అందించాలని కోరారు.
ఈ సందర్భంగా డాక్టర్ అంబుల మనోజ్ మాట్లాడుతూ, రైతులు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అత్యంత అవసరమని, ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, స్థానిక నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.