✍🏼✍🏼RSR NEWS✍🏼✍🏼
🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
చింతలపూడి, తేదీ:
నాటు సారా నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా 26 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి నిమిత్తం రూ.19 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నవోదయం 2.0 కార్యక్రమాల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, నాటు సారా తయారీని పూర్తిగా మానుకొని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టి మంచి జీవన విధానం కొనసాగించాలని సూచించారు.
నాటు సారాకు దూరంగా ఉండి, చట్టబద్ధమైన ఉపాధి మార్గాలను ఎంచుకుంటే కుటుంబాల భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో గుర్తించిన 26 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.







