Ticker

6/recent/ticker-posts

అమరావతి నిర్మాణానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చిన సహృదయులు – ముదినేపల్లిలో సన్మానం




 
✍🏼RSR న్యూస్✍🏼

🙏🏼✍🏼ఎడిటర్: చింతపల్లి శ్రీనివాసరావు 9949291526🙏🏼✍🏼

అమరావతి నిర్మాణానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చిన సహృదయులు – ముదినేపల్లిలో సన్మానం

ఏలూరు జిల్లా, ముదినేపల్లి మండలం, ముదినేపల్లి గ్రామంలో అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. ముదినేపల్లిలోని డాక్టర్ మనోజ్ హాస్పిటల్ మరియు ఆయన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఇచ్చిన పిలుపుకు సూచన కొన్ని సేవాభావంతో ముందుకు వచ్చారు.

అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని భావించిన వారు, తమ బాధ్యతగా ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేస్తూ “మేము సైతం అమరావతి ఈ సందర్భంగా క్యూ ఆర్ కోడ్ ద్వారా సిఆర్డిఏ ( సి ఆర్ డి ఏ )బ్యాంకు ఖాతాకు విరాళాన్ని జమ చేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి బంగారయ్య (అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, గుడివాడ), జుజ్జువరపు రాము, ఐలూరి తారక రామకృష్ణ, సుసర్ల శ్రీనివాస శర్మ, అబ్దుల్ వహాబ్ (గురజా మహమ్మదీయ మత బోధకులు), బృందావనం పద్మాకర రావు పాల్గొని తమ ఒకరోజు వేతనాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు.
విరాళం అందజేసిన వారిని డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి ఘనంగా సన్మానించారు. సమాజానికి సేవ చేసే మనసున్న వారిని గౌరవించడం తనకు గర్వకారణమని చెప్పారు. అమరావతి ప్రజల్లో మరింత చైతన్యం కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.