Ticker

6/recent/ticker-posts

వెలగపూడి సచివాలయంలో రాజధాని రైతులకు అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబులి వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ వారి చేతుల మీదుగా పాదపూజలు ఘనంగా సన్మానించారు.





 ✍🏼RSR NEWS✍🏼

🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼

వెలగపూడి సచివాలయంలో రాజధాని రైతులకు అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబులి వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ వారి చేతుల మీదుగా పాదపూజలు   ఘనంగా సన్మానించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ అమూల్యమైన భూములను త్యాగం చేసిన రాజధాని రైతులను గౌరవిస్తూ వెలగపూడి సచివాలయంలో పాదపూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థిని మరియు అమరావతి అంబాసిడర్  రాయబారిగా సేవలందిస్తున్న అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాల్గొని రైతులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని 

అమరావతి నిర్మాణం కోసం వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చి చరిత్రలో నిలిచిపోయే త్యాగం చేశారని కొనియాడారు. రైతులు చేసిన ఈ త్యాగం అమూల్యమని పేర్కొంటూ అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
అమరావతికి జీవం పోద్దాం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కనీసం రూ.116 చొప్పున సహాయం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు, స్థానిక ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు.