Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా *కొల్లేరు ఉత్సవానికి ఏర్పాట్లు చేయండి*




 

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao

ఏలూరు జిల్లా *కొల్లేరు ఉత్సవానికి ఏర్పాట్లు చేయండి*


* ఏలూరు, RSR, న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ :: ప్రతినిధి : విదేశీ వలస పక్షులు వచ్చే సమయంలో వాటిని అందరూ తిలకించేలా ఏర్పాట్లు ఉండాలి*


*కొల్లేరు ఉత్సవం నిర్వహణపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష*


          ఏలూరు, కొల్లేరు ప్రాంతంలో 'కొల్లేరు ఉత్సవాన్ని' ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం 'కొల్లేరు ఉత్సవం' ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతానికి ప్రస్తుతం విదేశాల నుండి వివిధ రకాల వలస పక్షులు వచ్చే సమయమని, వాటిని ఆసక్తిగల వారందరూ తిలకించేలా రెండు రోజులపాటు 'కొల్లేరు ఉత్సవాన్ని' నిర్వహించాలని, అందుకు అనువైన తేదీలను నిర్ణయించాలని, ఇందుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై జిల్లా అధికారులతో కమిటీ ని ఏర్పాటుచేసి, వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. 'కొల్లేరు ఉత్సవం' సమయంలో పక్షులు చూడడం, బైనాక్యులర్స్ ఏర్పాటు, బోటింగ్, తదితర కార్యక్రమాలకు వచ్చే ప్రజలను అంచనా వేసి, అందుకు అనువైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 'కొల్లేరు ఉత్సవం' లో పాల్గొన్న అనంతరం వెళ్లేందుకు దగ్గరలోని దేవాలయాలు, పర్యటక కేంద్రాల వివరాలతో 'టూరిజం సర్క్యూట్' వివరాలను కార్యక్రమంలో పాల్గొనే వారికి అందుబాటులో ఉంచాలన్నారు. పర్యాటకుల సంఖ్యకు తగినవిధంగా ఫుడ్ కోర్ట్ లు, స్టాల్ల్స్, ఏర్పాటుచేయాలని అదేవిధంగా త్రాగునీరు, టాయిలెట్ల ఏర్పాటు చేయాలన్నారు.  

              కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఎఫ్ఓ విజయ, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ సిహెచ్ . పవన్ కుమార్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఈఈ రెడ్డి, జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు