Ticker

6/recent/ticker-posts

ఏలూరు విద్యుత్ ఘాతంలో మృతి చెందిన మున్సిపల్ జెసిపి డ్రైవర్ రమేష్ కుటుంబానికి ఆర్థిక సాయం


 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao

ఏలూరు విద్యుత్ ఘాతంలో మృతి చెందిన మున్సిపల్ జెసిపి డ్రైవర్ రమేష్ కుటుంబానికి ఆర్థిక సాయం


ఏలూరు నగరపాలక సంస్థలో జెసిపి డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్ ఇటీవల విధి నిర్వహణలో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడం అత్యంత విషాదకరమని పలువురు మున్సిపల్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటనకు చలించి, ఏలూరు మున్సిపల్ ఆఫీస్‌కు చెందిన ఆల్ స్టాఫ్ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మొత్తం రూ. 2,35,000/- (రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు)లను సమీకరించారు.

సేకరించిన ఈ ఆర్థిక సహాయాన్ని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎమ్ ఆర్ పెదబాబు ద్వారా మృతుడు రమేష్ భార్యకు మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడుతూ, రమేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సంఘ నాయకులు పాల్గొన్నారు